ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలింపు

AP Governor Biswabhusan Harichandan fell ill
  • ఒక్కసారిగా అస్వస్థతకు గురైన గవర్నర్
  • గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • కాసేపట్లో హెల్త్ బులెటిన్!
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. గవర్నర్ అస్వస్థతకు కారణాలు తెలియరాలేదు. కాసేపట్లో గవర్నర్ ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి నుంచి బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Go Back to Shorts
Andhra Pradesh
Governor
Biswabhusan Harichandan

More Telugu News