Radhe Shyam: భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు... యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ లను అరెస్ట్ చేయాలన్న నెటిజన్... స్పందించిన పోలీసులు

Netizen demands arrest of UV Creations Vamshi and Pramod
షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాధేశ్యామ్. అయితే ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలలో రెండుసార్లు జాప్యం జరిగింది. తొలుత ఇవాళ 5 గంటలకు విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. కానీ, దాన్ని రాత్రి 8 గంటలకు వాయిదా వేసింది. అప్పటికీ విడుదల చేయకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ నెటిజన్ దీనిపై హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. "సర్ దయచేసి యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ లను అరెస్ట్ చేయండి" అంటూ ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశాడు. వారిద్దరూ అభిమానుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నాడు.

ఈ ట్వీట్ కు హైదరాబాద్ పోలీసులు స్పందించారు. 'స్థానిక పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి' అని సూచించారు. అంతకుముందు యూవీ క్రియేషన్స్ సాయంత్రం 5 గంటలకు పాట విడుదల కాకపోవడం పట్ల వివరణ ఇచ్చింది. సాంకేంతిక లోపం కారణంగానే పాట విడుదల చేయలేకపోతున్నామని, రాత్రి 8 గంటలకు లిరికల్ వీడియో రిలీజ్ చేస్తామని పేర్కొంది. అయితే అది కూడా జరగకపోవడంతో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Go Back to Shorts
Radhe Shyam
Song
Delay
UV Creations
Police

More Telugu News