కుప్పంలో ఓటు లేని చంద్రబాబు స్పెషల్ ఫ్లయిట్ లో ఎందుకు వెళుతున్నారు?: లేళ్ల అప్పిరెడ్డి
- కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్
- టీడీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
- చంద్రబాబుపై లేళ్ల అప్పిరెడ్డి విమర్శనాస్త్రాలు
- రాజకీయ విలువలు మంటగలుపుతున్నారని వ్యాఖ్యలు
దొంగ ఓట్లు వేయించే సంస్కృతి టీడీపీదేనని వ్యాఖ్యానించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటే, భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని, ఈ మేరకు తాము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశామని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు.