ఏపీలో ప్రారంభమైన కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్
- భారీగా తరలివస్తున్న ఓటర్లు
- సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్
- బుధవారం ఫలితాల వెల్లడి
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు, కుప్పం మునిసిపాలిటీలో 24 వార్డులు, జగ్గయ్యపేట మునిసిపాలిటిలో 31 వార్డులు, కొండపల్లి మునిసిపాలిటీలో 29, పెనుకొండలో 20, రాజంపేటలో 29, కమలాపురం నగర పంచాయతీలో 20, ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తామని, బుధవారం 8 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.