గొడ్డలిపోటును గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు: అయ్యన్నపాత్రుడు

  • రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివేకా హత్య
  • వివేకా కేసులో కీలక పురోగతి
  • మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో సంచలన విషయాలు
  • హూ కిల్డ్ వివేకా ప్రశ్నకు జవాబు దొరికిందన్న అయ్యన్న
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని తెలిపారు. జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా అని తేలిపోయింది విజయసాయిరెడ్డి అంటూ ట్వీట్ చేశారు. బాబాయ్ పై జగన్ రెడ్డి గొడ్డలిపోటును గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని అయ్యన్న ఎద్దేవా చేశారు.

"త్వరలోనే అప్రూవర్ గా మారి వైసీపీని రెండుగా చీల్చి సీఎం అవ్వాలనే నీ ప్లాన్-ఏ లీకైందని అంటున్నారు. బాత్రూంలో గుండెపోటు వచ్చే లోపే విదేశాలకు జంప్ అవ్వాలనే ప్లాన్-బీ కూడా సిద్ధం చేసుకుంటున్నావటగా సాయిరెడ్డీ!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

Ayyanna Patrudu
Vijay Sai Reddy
YS Vivekananda Reddy
YS Jagan

More Telugu News