టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది.. కుప్పం కూడా మాదే: మంత్రి బాలినేని

Balineni Srinivasarddy Fires on Nara lokesh
  • ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా కుప్పంలోనూ వైసీపీదే గెలుపు
  • లోకేశ్ ఓటుకు రూ. 5 వేలు పంచడం సిగ్గుచేటు
  • కుప్పం మునిసిపాలిటీని అభివృద్ధి చేసింది జగనే
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగనున్న మునిసిపల్ ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కుప్పం ఎన్నికలు ఒక ఎత్తుగా మారిపోయాయి. కుప్పంలో ప్రస్తుత వాతావరణం వాడివేడిగా ఉంది. గెలుపుపై అధికార, ప్రతిపక్షాలు ధీమాగా ఉన్నప్పటికీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కుప్పంలో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఇప్పటికే వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు లోకేశ్‌పై మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. తాజాగా మంత్రి బాలినేని కూడా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు.

ప్రతిపక్షం ఎన్నికుట్రలు చేసినా కుప్పంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని, నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ విజయం పక్కా అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కుప్పంలోనూ టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో లోకేశ్ ఓటుకు రూ. 5 వేలు పంచడం సిగ్గుచేటన్నారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్ర‌బాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పం మునిసిపాలిటీని అభివృద్ధి చేసిన ఘతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని బాలినేని అన్నారు.
Go Back to Shorts
Balineni Srinivasa Reddy
YSRCP
TDP
Nara Lokesh
Kuppam
Municipal Elections

More Telugu News