సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తెలుగు సినిమాలో బాలీవుడ్ భామ
- బాలకృష్ణ కొత్త సినిమా ముహూర్తం
- చరణ్, శంకర్ సినిమా తాజా షెడ్యూలు
* నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. కాగా, ఈ చిత్రం ముహూర్తాన్ని ఈ నెల 13న ఉదయం 10.26 నిమిషాలకు నిర్వహించనున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది.
* మెగా హీరో రామ్ చరణ్, శంకర్ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూలు ఇటీవల పూణేలో పదిహేను రోజుల పాటు జరిగింది. కాగా, మలిషెడ్యూలు షూటింగును ఈ నెల 15 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.