జర్మనీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
- పలుదేశాల్లో మరోసారి కరోనా కలకలం
- జర్మనీలో నిన్న 39 వేలకు పైగా కేసులు
- ఆసుపత్రులకు పోటెత్తుతున్న బాధితులు
- వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే కారణమంటున్న నిపుణులు
కొత్తగా వచ్చే రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోలేకపోతున్నామని అక్కడి వైద్య సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది మొత్తం కరోనా రోగుల బాగోగులు చూసుకోవడానికి సరిపోతున్నారని, ఇతర కేసుల్లో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించలేకపోతున్నామని ఓ ఆసుపత్రి యజమాన్యం వాపోయింది.
కాగా, జర్మనీలో కరోనా మళ్లీ ఈ స్థాయిలో విజృంభించడానికి ఇంకా చాలామంది వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. కొత్త కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే దేశంలో లాక్ డౌన్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.