ప్రజలు మనవైపే ఉన్నారు: నారా లోకేశ్

వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడమే మన లక్ష్యమని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని చెప్పారు. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా కొడికొండ చెక్ పోస్ట్ వద్ద టీడీపీ కార్యకర్తలను లోకేశ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగాయని అన్నారు. చింతపండు నుంచి నూనె, పెట్రోల్, డీజిల్ అన్నింటి ధరలను పెంచేశారని విమర్శించారు. ధరల పెరుగుదలపై టీడీపీ శ్రేణులు పోరాటం చేయాలని చెప్పారు.

పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించడం లేదని దుయ్యబట్టారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పారు. టీడీపీ అభ్యర్థుల గెలుపుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


More Telugu News