శివ కార్తికేయన్ 'డాన్' నుంచి ఫస్టులుక్!
- 'డాక్టర్' సినిమాతో దొరికిన హిట్
- ఒక్కసారిగా 100 కోట్ల క్లబ్ లోకి
- మరోసారి ప్రియాంక అరుళ్ మోహన్ కి ఛాన్స్
ఇక లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఆయన మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి 'డాన్' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. 'డాక్టర్' సినిమాలో తన జోడీగా అలరించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలోనూ నాయిక. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ ను కాలేజ్ నేపథ్యంలో డిజైన్ చేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తమ చేతిలో ఉన్న వస్తువులను శివ కార్తికేయన్ పైకి విసురుతున్నట్టు .. టీచర్స్ ను టార్చర్ పెట్టడం ఎలా? అనే బుక్స్ ను చదువుతున్నట్టు ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. దీనిని బట్టి ఇది కామెడీ టచ్ ఉన్న కథ అనీ .. కాలేజ్ లెక్చరర్ అయిన శివకార్తికేయన్ వారి పట్ల ఒక 'డాన్'లా వ్యవహరిస్తాడని అర్థమవుతోంది.