మరణానంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్... అవార్డు స్వీకరించిన తనయుడు
- 2020, 21 సంవత్సరాలకు పద్మ పురస్కారాల ప్రదానం
- గతేడాది కరోనా ప్రభావంతో కన్నుమూసిన బాలు
- గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న గాన గంధర్వుడు
2020, 21 సంవత్సరాలకు గాను పద్మ పురస్కారాలను రెండ్రోజులుగా నాలుగు విడతల్లో ప్రదానం చేస్తున్నారు. ఎస్పీ బాలు (74) గతేడాది కరోనా బారినపడి, నెలరోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొంది తుదిశ్వాస విడిచారు. బాలు మృతితో భారతీయ సినీ రంగం తీవ్ర విషాదానికి గురైంది. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలును 2001లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్ వరించింది.