దేశంలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి... శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే: భట్టి
- కొంపల్లిలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాల నమోదు
- కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి వ్యాఖ్యలు
- కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ లను ఓడించాలని పిలుపు
కాంగ్రెస్ పై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా సరిపోరని భట్టి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి పదవి తన ముందు నిలిచినా వద్దనుకున్న త్యాగమూర్తి సోనియా గాంధీ అని వివరించారు. దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, గాంధేయవాదమే కాంగ్రెస్ భావజాలమని స్పష్టం చేశారు.
దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో చిక్కుకుందని, దేశాన్ని ఓవైపు బీజేపీ పట్టిపీడిస్తుంటే, మరోవైపు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ దోచుకుంటోందని అన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.