కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిధులు దారి మళ్లించేందుకేనా?: పవన్ కల్యాణ్
- టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై పవన్ స్పందన
- ఉన్న వ్యవస్థలను మార్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు
- వైసీపీ ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యలు
- కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ
ఈ రీతిలోనే 73 ఉద్యోగ సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్ మార్చడం అంటే ఉద్యోగులను రోడ్డుమీదకు ఈడ్చే దారుణమైన చర్య అని విమర్శించారు. ఇది పొమ్మనకుండా పొగబెట్టడం వంటి నిర్ణయంగా భావించాల్సి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిధులు దారిమళ్లించేందుకేనా? అసలు ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా? అని నిలదీశారు. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు తాము అండగా ఉంటామని జనసేనాని భరోసా ఇచ్చారు.