Nara Lokesh: గ‌తంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను.. ప‌క్క రాష్ట్రాల్లోని రేట్ల‌తో పోల్చుతూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్

lokesh slams ycp
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. గ‌తంలో ఎన్నిక‌ల ముందు వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు. ప‌క్క రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్ల కంటే ఏపీలో రూ.5-రూ.7 ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో రేట్లు పెరిగిపోయాయ‌ని జ‌గ‌న్ అప్ప‌ట్లో అన్నారు. ఆయ‌న అప్ప‌ట్లో చేసిన వ్యాఖ్యల‌ను లోకేశ్ గుర్తు చేశారు.

'చంద్ర‌బాబు గారి పాల‌న‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే యానాం వెళ్లాలన్నారు. మీ పాలనలో అవే ధరలు తెలుసుకోవడానికి దేశంలో ఏ రాష్ట్ర‌మైనా వెళ్లేందుకు మేము సిద్ధం, మీరు సిద్ధ‌మా వ‌సూల్ రెడ్డి గారు' అంటూ లోకేశ్ సవాలు చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News