బీహార్‌లో దారుణం.. ఏఎస్సైని కట్టేసి చితకబాదిన యువకులు.. వీడియో ఇదిగో!

  • ఘర్షణ జరుగుతున్నట్టు సమాచారం 
  • ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్సై
  • దీపావళినాడు పెట్రోలింగ్ ఏంటంటూ పట్టుకుని చితకబాదిన వైనం
గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ ఏఎస్సైని తాళ్లతో బంధించి చితకబాదిన ఘటన బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది. ఏఎస్సైని బంధించి దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జిల్లాలోని మోతిహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్‌పుర గ్రామంలో ఘర్షణ జరుగుతున్నట్టు దీపావళి రోజున సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఏఎస్సై సీతారం దాస్ బయలుదేరి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఏఎస్సైని చూస్తూనే అక్కడి యువకులు మరింతగా రెచ్చిపోయారు. దీపావళినాడు పెట్రోలింగ్ ఏంటని ప్రశ్నిస్తూ దాడికి దిగారు. ఆయనను పట్టుకుని.. చేతులను తాళ్లతో వెనక్కి కట్టేశారు. ఆపై అందరూ కలిసి చితకబాదారు.

ఈ ఘటన మొత్తాన్ని ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఆ తర్వాత కాసేపటికి బంధించిన ఏఎస్సైని యువకులు విడిచిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


Bihar
ASI
Police
Attack

More Telugu News