Priyanka Arul Mohan: చెన్నై చందమామ ఖాతాలో పడిపోయిన ఫస్టు హిట్!

First Hit Priyanka Arul Mohan first hit in Kollywood
షార్ట్స్‌లో చూడండి
ప్రియాంక అరుళ్ మోహన్ కన్నడ సినిమా ద్వారా కథానాయికగా తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ వెంటనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని జోడీగా 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అయితే గ్లామర్ పరంగా ఈ బ్యూటీకి మంచి మార్కులు పడిపోయాయి. ఇక ఈ సుందరి హవా కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే శర్వానంద్ సరసన నాయికగా 'శ్రీకారం' సినిమా చేసింది. కిశోర్ బి దర్శకత్వం వహించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కింది. ఈ సినిమాలో ఈ చెన్నై చందమామను చూసిన కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ బ్యూటీని పట్టుకోవడం కష్టమేనని చెప్పుకున్నారు. కానీ దురదృష్టం కొద్దీ ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు. దాంతో ఇక్కడ ప్రియాంకను పట్టించుకునేవారు లేకుండా పోయారు.

ఈ సమయంలోనే ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. శివ కార్తికేయన్ సరసన నాయికగా 'డాక్టర్' .. 'డాన్' సినిమాలు చేసింది. అంతేకాదు సూర్య కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాలోనూ ఆయన సరసన నాయికగా అవకాశాన్ని దక్కించుకుంది. శివకార్తికేయన్ నుంచి వచ్చిన 'డాక్టర్' తమిళనాట వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఆయన కెరియర్లో 100 కోట్ల మార్క్ ను టచ్ చేసిన సినిమాగా నిలిచింది. దాంతో ఇప్పుడు ఈ సుందరి ఫుల్ ఖుషీ అవుతోందట. ఫస్టు హిట్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక, ఇక తన కెరియర్ పుంజుకోవడం ఖాయమనే నమ్మకంతో ఉందని అంటున్నారు. ఇక తెలుగు నుంచి కూడా అవకాశాలు వెళతాయేమో చూడాలి.
Go Back to Shorts
Priyanka Arul Mohan
Shiva Karthikeyan
Surya

More Telugu News