'వీరమల్లు' సెట్స్ పైకి పండగ తరువాత పవన్!
- 'వీరమల్లు' తాజా షెడ్యూల్ మొదలు
- మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ
- తాజా షూటింగుకు జాక్విలిన్ .. అర్జున్ రాంపాల్
- ఏప్రిల్ 29వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమా 50 శాతం షూటింగు పూర్తిచేసుకున్న తరువాత, కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత 'భీమ్లానాయక్' సినిమాను ముందుగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో పవన్ ఆ పనిలోనే ఉన్నాడు. ఆయనకి సంబంధించిన పోర్షన్ చాలావరకూ పూర్తయింది. అందువలన ఇక 'వీరమల్లు' సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ ను ఈ రోజున మొదలుపెట్టారు. దీపావళి పండుగ తరువాత పవన్ షూటింగులో జాయిన్ కానున్నాడు. జాక్విలిన్ ఫెర్నాండేజ్ .. అర్జున్ రాంపాల్ కూడా ఈ షెడ్యూల్ షూటింగులో జాయిన్ కానున్నారు. పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాను, ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నారు.