16వ రౌండ్ లో కూడా ఈటలదే ఆధిక్యం
- గెలుపు దిశగా దూసుకుపోతున్న ఈటల
- 16వ రౌండ్ లో ఈటలకు 1,712 ఓట్ల మెజార్టీ
- బీజేపీ కార్యాలయం వద్ద నెలకొన్న పండుగ వాతావరణం
ఈ రౌండ్ ముగిసేసరికి మొత్తం 13,255 ఓట్ల మెజార్టీతో ఈటల స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో బీజేపీకి 74,175 ఓట్లు, టీఆర్ఎస్ కు 60,920 ఓట్లు వచ్చాయి. ఈటల గెలుపు దాదాపు ఖరారు కావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది.