దళితబంధు పని చేయలేదా?... పథకాన్ని కేసీఆర్ ప్రారంభించిన శాలపల్లిలో కూడా టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ!
- దళితబంధుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్
- హుజూరాబాద్ లో ఎస్సీ, ఎస్టీల ఓట్లు దాదాపు 50 వేలు
- శాలపల్లిలో 135 ఓట్ల ఆధిక్యతను సాధించిన ఈటల
అయితే అంచనాలకు విరుద్ధంగా దళితబంధు ఓటర్లను ఆకట్టుకోకపోయిందనే భావన ఇప్పుడు వెలువడుతోంది. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరి సమక్షంలో భారీ బహిరంగసభలో ఈ పథకాన్ని ఆరంభించారు. పథకానికి సంబంధించి వివరాలను ఆయనే స్వయంగా వేదికపై నుంచే అందరికీ వివరించారు. అయితే, శాలపల్లిలో వెలువడిన ఫలితాలు టీఆర్ఎస్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 135 ఓట్ల ఆధిక్యతను సాధించారు.