న్యూజిలాండ్ పై అతికష్టమ్మీద 110 పరుగులు చేసిన టీమిండియా
- మరోసారి టీమిండియా టాపార్డర్ విఫలం
- పేలవ షాట్లతో అవుటైన భారత బ్యాట్స్ మెన్
- 26 పరుగులు చేసిన జడేజా
- ట్రెంట్ బౌల్ట్ కు 3 వికెట్లు
కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 పరుగులు చేసి నిరాశపర్చగా, ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషన్ (4) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ హిట్టింగ్ చేస్తాడని భావించిన రిషబ్ పంత్ (12)ను మిల్నే బౌల్డ్ చేయడంతో ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయి.
న్యూజిలాండ్ బౌలింగ్ మరీ అంత ప్రమాదకరంగా ఏమీ లేకపోయినా, భారత ఆటగాళ్లు పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. కివీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ 3, లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ 1, ఆడమ్ మిల్నే 1 వికెట్ తీశారు.