పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై విపక్ష నేతగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియో పంచుకున్న బుచ్చయ్య చౌదరి
- ఏపీలో చమురు ధరల పెంపు
- ట్విట్టర్ లో ప్రశ్నించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- ధరలు తగ్గించే బాధ్యత సీఎందేనని వెల్లడి
- పెరిగిన రేట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
"రాష్ట్రంలో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి... మరి ఆ ధరలు తగ్గించే బాధ్యత మీ మీద లేదా మడమ తిప్పని నేత గారూ?" అంటూ నిలదీశారు. "మీ 'బీపీ'లు పెరిగిన రేట్ల మీద చూపించండి ముఖ్యమంత్రి గారూ!" అంటూ వ్యాఖ్యానించారు.