తీవ్ర గుండెపోటు కారణంగానే పునీత్ రాజ్‌కుమార్ మృతి.. నిర్ధారించిన వైద్యులు
- జిమ్‌లో వ్యాయామం చేసి బయటకు వచ్చాక చెమటలు
- వెంటనే కుటుంబ వైద్యుడి క్లినిక్‌కు
- హృదయ స్పందనలో తేడాలు గుర్తించిన డాక్టర్ రమణారావు
- విక్రం ఆసుపత్రిలో వెంటిలేటర్ ఆమర్చిన కాసేపటికే కన్నుమూత
అక్కడ పునీత్ వైద్యులతో మాట్లాడుతూ.. జిమ్‌లో వ్యాయామం చేసి బయటకు వచ్చాక చెమటలు పట్టాయని, అన్ని రకాల వ్యాయామాలు చేశానని డాక్టర్ రమణారావుకు చెప్పారు. బాక్సింగ్ కూడా చేశానని, ఆ తర్వాత ఏదో ఇబ్బంది అనిపించిందని చెప్పారు. దీంతో వెంటనే వైద్యులు ఆయనకు ఈసీజీ తీసి పరిశీలిస్తే హృదయ స్పందనలో తేడా కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
కారు వరకు నడిస్తే ఇబ్బంది పడతారని భావించి చక్రాల కుర్చీలో కారు వరకు తీసుకెళ్లారు. అదే సమయంలో విక్రం ఆసుపత్రికి ఫోన్ చేసిన పునీత్ భార్య అశ్విని పరిస్థితి వివరించారు. ఈలోగా ఉదయం 11.45 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. పునీత్ ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వెంటిలేటర్ అమర్చారు. అయితే, అప్పటికే తీవ్ర గుండెపోటుకు గురికావడంతో కాసేపటికే పునీత్ మరణించినట్టు డాక్టర్ రమణారావు వివరించారు.