ప్రైవేటు వాహనంలో హుజూరాబాద్ ఈవీఎం తరలింపు.. పట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
- హుజూరాబాద్‌లో రికార్డు స్థాయిలో 86.57 శాతం పోలింగ్
- ఈవీఎంను ప్రైవేటు బస్సులో తరలిస్తుండగా అడ్డగింత
- తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మరోవైపు, ఈవీఎంను తరలిస్తున్న బస్సు పంక్చర్ కావడంతో జమ్మికుంట వద్ద ఆపారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాకెక్కి హల్‌చల్ చేస్తున్నాయి. కాగా, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి హుజూరాబాద్‌లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఏకంగా 86.57శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 306 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,37,022 మంది ఓటర్లకుగాను 2,05,053 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.