తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 37,882 కరోనా పరీక్షలు
- 168 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 62 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,072 మందికి చికిత్స
ఇక జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ములుగు, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 191 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,71,342 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,315 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,072 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,955కి పెరిగింది.
