చిరంజీవి పక్కన చిన్న పాత్ర అయినా చాలన్నాడు: పునీత్ గురించి మెహర్ రమేశ్ వెల్లడి
- గతంలో 'వీర కన్నడిగ' చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం
- హీరోగా నటించిన పునీత్ రాజ్ కుమార్
- తనను ఓ కుటుంబ సభ్యుడిలా చూసేవారన్న రమేశ్
- భోళా శంకర్ అనౌన్స్ చేయగానే ఫోన్ చేశాడని వెల్లడి
ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో 'భోళాశంకర్' సినిమా అనౌన్స్ చేయగానే, పునీత్ రాజ్ కుమార్ తనకు ఫోన్ చేశారని మెహర్ రమేశ్ వివరించారు. ఆ సినిమాలో చిరంజీవి పక్కన నటించాలని ఉందని తన మనసులో మాటను పంచుకున్నారని, కనీసం చిన్న పాత్రయినా చేస్తానని చెప్పారని వెల్లడించారు. అది కూడా కుదరకపోతే ఓ పాటలో అయినా చిరంజీవితో డ్యాన్స్ చేసే అవకాశం కల్పించమని అడిగారని, కానీ ఆయన కల తీరకుండానే మనందరినీ వదిలి వెళ్లిపోయారని మెహర్ రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనను ఓ కుటుంబ సభ్యుడిలానే భావించేవారని తెలిపారు.
పునీత్ శుక్రవారం నాడు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలడం తెలిసిందే. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆయన అంత్యక్రియలు ఆదివారం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్ లో జరగనున్నాయి.