అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె

కర్ణాటక వ్యాప్తంగా విషాదభరిత వాతావరణం కొనసాగుతోంది. పవర్ స్టార్ గా, అప్పుగా అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం చెందడం తాలూకు దిగ్భ్రాంతి ఇంకా తొలగిపోలేదు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేసినట్టు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకుందని, ఆమె రాత్రి 7 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని వివరించారు. సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు చేయరాదని భావించి అంత్యక్రియలు రేపు జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Puneeth Rajkumar
Daughter
New Delhi
USA
Bengaluru

More Telugu News