Chandrababu: పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు: చంద్రబాబు

Chandrabau said Puneet Raj Kumar demise huge loss to Kannda film industry
  • పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
  • కుటుంబసభ్యులకు, అభిమానులకు సంతాపం తెలుపుతూ ట్వీట్
  • గుండె పగిలినంత పనైందన్న ఎన్టీఆర్
శాండల్ వుడ్ అగ్ర కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ (46) అకాలమరణం చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు, అభిమానులకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

అటు, జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, ఈ వార్త వినగానే గుండె పగిలినంత పనైందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'ఇంత త్వరగా వెళ్లిపోతావనుకోలేదు సోదరా' అంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2016లో విడుదలైన పునీత్ రాజ్ కుమార్ చిత్రం 'చక్రవ్యూహ'లో జూనియర్ ఎన్టీఆర్ 'గెలియా గెలియా' అనే హుషారైన గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు గాను ఎన్టీఆర్ కు 'మిర్చి మ్యూజిక్ అవార్డు' కూడా లభించింది.
Chandrababu
Puneet Raj Kumar
Demise
Karnataka

More Telugu News