ఆర్‌బీఐ గవర్నర్‌గా మళ్లీ శక్తికాంత దాసే.. పదవీకాలాన్ని మరోమూడేళ్లు పొడిగించిన కేంద్రం
- 11 డిసెంబరు 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా నియామకం
- ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న పదవీ కాలం
- నియామకాన్ని ఆమోదించిన కేబినెట్ పునర్నియామక కమిటీ
ఆర్థిక మంత్రత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా గతంలో పనిచేసిన శక్తికాంత దాస్ 11 డిసెంబరు 2018లో భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఈ గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.