ఆర్‌బీఐ గవర్నర్‌గా మళ్లీ శక్తికాంత దాసే.. పదవీకాలాన్ని మరోమూడేళ్లు పొడిగించిన కేంద్రం

  • 11 డిసెంబరు 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా నియామకం
  • ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న పదవీ కాలం
  • నియామకాన్ని ఆమోదించిన కేబినెట్ పునర్నియామక కమిటీ
భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. శక్తికాంత దాస్ పునఃనియామకాన్ని కేబినెట్ పునర్నియామక కమిటీ ఆమోదించింది. 10 డిసెంబరు 2021 నుంచి మూడేళ్లపాటు లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది.

 ఆర్థిక మంత్రత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా గతంలో పనిచేసిన శక్తికాంత దాస్ 11 డిసెంబరు 2018లో భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఈ గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  

RBI
Shaktikanta Das
RBI Governor

More Telugu News