డబ్బుల కోసం కల్లు వ్యాపారిని బెదిరించిన కేసు.. తీన్మార్ మల్లన్నకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్
- వ్యాపారిని బెదిరించిన కేసులో ఎ2 నిందితుడిగా మల్లన్న
- ఎ1 నిందితుడిగా మల్లన్న అనుచరుడు ఉప్పు సంతోష్
- మల్లన్నను నిన్న కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ఈ నెల 10న కేసు నమోదు కాగా, అదే రోజున సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఆ సమయంలో మల్లన్న మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. న్యాయస్థానం అనుమతితో చంచల్‌గూడ నుంచి మల్లన్నను తీసుకొచ్చిన పోలీసులు నిన్న నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.