తెలంగాణలో కొత్తగా 207 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 42,108 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 38 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,984 మందికి చికిత్స
అదే సమయంలో 184 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,139 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,209 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,984 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,946కి పెరిగింది.
