తైవాన్ పూర్తిగా మా భూభాగానికి చెందినది.. ఇది మా అంతర్గత విషయం: చైనా స్పష్టీకరణ
- తైవాన్ను స్వాధీనం చేసుకుంటామన్న చైనా వ్యాఖ్యలపై అమెరికా గుర్రు
- ఎలా చేసుకుంటారో చూస్తామన్న బైడెన్
- మధ్యలో మీరెవన్న చైనా
మరోవైపు, అమెరికా వ్యాఖ్యలపై చైనా కూడా అంతే దీటుగా స్పందించింది. తైవాన్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు. తైవాన్ పూర్తిగా తమ భూభాగానికి చెందినదని, ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని అన్నారు. ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పారు. తైవాన్ను స్వాధీనం చేసుకుంటామంటూ చైనా ఇటీవల తరచూ చేస్తున్న వ్యాఖ్యలే రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.