బీజేపీ ర్యాలీని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు... కిషన్ రెడ్డి ఆగ్రహం
- ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
- హోరాహోరీగా ప్రచారం
- ఈటల తరఫున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం
- బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఇక, ఇల్లందకుంట మండలం బుజునూరు వద్ద కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ ఆత్మాభిమానానికి, కేసీఆర్ అహంకార ధోరణికి మధ్య జరుగుతున్న పోరాటమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని స్పష్టం చేశారు. ధర్మం ఈటల వైపే ఉందని, అక్రమంగా సంపాదించిన డబ్బుతో కేసీఆర్ గెలవాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫాంహౌస్ పాలన కావాలో, సంక్షేమ పాలన కావాలో ఓసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.