రేపు గుడ్ న్యూస్ చెపుతా: మంచు విష్ణు

Good news to share says Manchu Vishnu
  • 'మా' అధ్యక్షుడిగా కార్యాచరణ మొదలుపెట్టిన విష్ణు
  • బాధ్యతలను స్వీకరించిన విష్ణు ప్యానల్ సభ్యులు
  • అసోసియేషన్ కు సంబంధించిన గుడ్ న్యూస్ చెపుతానని విష్ణు ట్వీట్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు కార్యరంగంలోకి దిగారు. అసోసియేషన్ బాధ్యతలను ఇటీవలే ఆయన స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన ప్యానల్ సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలుపొందిన వారంతా రాజీనామాలు చేశారు. మంచు విష్ణు ప్యానల్ తో కలిసి తాము పని చేయలేమని వారు స్పష్టం చేశారు. అయితే, వీరి రాజీనామాలను ఆమోదించే అంశంపై విష్ణు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు 'మా'కు సంబంధించి గుడ్ న్యూస్ చెపుతానని విష్ణు కాసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా తెలిపారు. అది ఏంటనేది రేపు వెల్లడిస్తానని చెప్పారు.
Go Back to Shorts
Manchu Vishnu
Tollywood
MAA

More Telugu News