ఘనంగా వైవా హర్ష వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు
- ఫొటోను ట్వీట్ చేసిన మారుతి
- నిర్మాత ఎస్కేఎన్, కమెడియన్ ప్రవీణ్ హాజరు
- ఈ ఏడాది జనవరి 11న నిశ్చితార్థం
- స్నేహితురాలిని ప్రేమ పెళ్లి చేసుకున్న హర్ష
హర్ష చెముడు.. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. ‘వైవా’ కాన్సెప్ట్ తో షార్ట్ వీడియోలు తీసి సక్సెస్ అయ్యాడు. అందరికీ బాగా చేరువయ్యాడు. దీంతో వైవా హర్షగా అతడికి పేరు పడిపోయింది. ఆ తర్వాత 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
కాగా, ఈ ఏడాది జనవరి 11న తన స్నేహితురాలు అక్షర రీసుతో అతడికి నిశ్చితార్థం అయింది. ఎం. కామ్ చదివిన ఆమెతో హర్షకు నాలుగేళ్ల పరిచయం ఉంది. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.