విజయవాడలో టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడి
- సీఎం జగన్ పై వ్యాఖ్యల పట్ల వైసీపీ శ్రేణుల ఆగ్రహం
- పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు
- పట్టాభి నివాసంలో సామగ్రి ధ్వంసం
- మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపైనా దాడి
టీడీపీ నేతల్లో క్రమం తప్పకుండా గళం వినిపించే వారిలో పట్టాభి ఒకరు. ఆయన తరచుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సీఎం జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. తాజాగా నక్కా ఆనంద్ బాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై పట్టాభి చేసిన విమర్శలు వైసీపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేశాయి. గతంలోనూ ఓసారి పట్టాభి వాహనాన్ని దుండగులు ధ్వసం చేయడం తెలిసిందే.