రామ్ జోడీగా 'రొమాంటిక్' హీరోయిన్!

Kethika Sharma in Ram movie
  • వచ్చేనెల నెల 4వ తేదీన 'రొమాంటిక్' రిలీజ్
  • విడుదలకు రెడీ అవుతున్న 'లక్ష్య'
  • సెట్స్ పై ఉన్న వైష్ణవ్ తేజ్ సినిమా
  • రామ్ నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్  
తెలుగు తెరకి త్వరలో పరిచయం కానున్న కథానాయికలలో 'కేతిక శర్మ' ఒకరు. ఆకాశ్ పూరి జోడీగా ఈ బ్యూటీ 'రొమాంటిక్' సినిమా చేసింది. ఈ సినిమా నుంచి వచ్చిన ఈ సుందరి ఫస్టులుక్ చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదల కాకముందే ఈ అమ్మాయి మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసింది. నాగశౌర్య సరసన నాయికగా 'లక్ష్య' సినిమాను కూడా పూర్తి చేసిన ఈ అమ్మాయి, వైష్ణవ్ తేజ్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. 'రొమాంటిక్' సినిమా వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక 'లక్ష్య' సినిమా కూడా త్వరలోనే థియేటర్లకు వస్తుంది. వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న సినిమా షూటింగు దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేతిక మరో ఛాన్స్ ను కోట్టేసింది. రామ్ నెక్స్ట్ సినిమాలో ఆమె కథానాయికగా ఎంపిక అయిందని అంటున్నారు. ప్రస్తుతం రామ్ .. లింగుసామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Ram
Kethika Sharma
Tollywood

More Telugu News