Andhra Pradesh: ఏపీలో మరో 432 మందికి కరోనా పాజిటివ్

AP Corona Media Report
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 31,712 కరోనా పరీక్షలు నిర్వహించగా, 432 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 61, కృష్ణా జిల్లాలో 60 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 586 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,472 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,40,131 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,034 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,307కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Report
Today Cases
Deaths

More Telugu News