27న హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్
- హుజూరాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహ రచన
- ఎన్నికల సంఘం విధించిన కరోనా ఆంక్షల సమక్షంలోనే కేసీఆర్ సభ
- ఈ నెల 25న పార్టీ ప్లీనరీ.. 14 వేల మందికి ఆహ్వానం
మరోవైపు, ఈ నెల 25న హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు టీఆర్ఎస్ భవన్‌లో ఆ పార్టీ శాసన, పార్లమెంటరీ పార్టీ సంయుక్తంగా భేటీ అయి కేంద్ర, రాష్ట రాజకీయాలు, టీఆర్ఎస్ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ నెల 25న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నట్టు సమాచారం.