బతుకమ్మ పండుగ సందర్భంగా తెలుగులో సందేశమిచ్చిన ఎ.ఆర్. రెహ్మాన్
- సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మ్యూజిక్ మాస్ట్రో
- బతుకమ్మ అంటే ఐకమత్యానికి ప్రతిబింబమని కామెంట్
- ఆటపాటల్లో ఎంతో అనుభూతి ఉంటుందని ట్వీట్
ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఆడపడుచూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. బతుకమ్మ అంటూ తెలుగు, ఇంగ్లిష్ లో ఆయన హాష్ ట్యాగ్ ఇచ్చారు. ఆ పోస్ట్ కు తాను స్వరపరిచిన ‘అల్లిపూల బతుకమ్మ’ పాటను జత చేశారు.
కాగా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పాటను రూపొందించిన సంగతి తెలిసిందే. ఎ.ఆర్ రెహ్మాన్ బాణీలు సమకూర్చితే.. పాటను గౌతమ్ మేనన్ చిత్రీకరించారు. ఆ పాట యూట్యూబ్ లో దూసుకుపోతోంది.