రాష్ట్రపతిని కలిసిన రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ సీనియర్ నేతలు
- లఖింపూర్ ఖేరీలో హింసపై ఫిర్యాదు
- అజయ్ మిశ్రా రాజీనామా చేయాలన్న రాహుల్
- సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని వ్యాఖ్య
- ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా అన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. దేశంలో రైతులు, ఎస్సీలు, మహిళలకు న్యాయం జరగట్లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.