అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి.. రూ. 25 లక్షలు మంజూరు చేసిన కేసీఆర్
- పీఎన్ఎన్ వ్యాధి బారినపడిన శివాని
- మంత్రి నిరంజన్ రెడ్డితో మొరపెట్టుకున్న శివాని తండ్రి
- శివాని తండ్రికి చెక్కు అందజేత
శివాని అరుదైన వ్యాధి చికిత్సకు రూ. 30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో బాల్‌రెడ్డి హతాశులయ్యారు. అంత ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడంతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసి కుమార్తె పరిస్థితి వివరించారు. ఆయన ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రూ. 25 లక్షలు మంజూరు చేశారు. నిరంజన్‌రెడ్డి నిన్న ఆ చెక్కును బాల్‌రెడ్డికి అందించారు.