తెలంగాణలో కొత్తగా 162 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 33,506 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,235 మందికి చికిత్స
అదే సమయంలో 214 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,887 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,722 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,235 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,930కి పెరిగింది.
