ఊపర్ షేర్వాణీ... అందర్ పరేషానీ... కేసీఆర్ కీ కహానీ... అంతా అద్భుతమే!: షర్మిల వ్యంగ్యం

Sharmila satires in CM KCR administration
  • నిన్న అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం
  • బంగరు తెలంగాణ అంటూ వెల్లడి
  • అన్నీ అద్భుతమేనంటూ ఓ పత్రికలో కథనం
  • మహా అద్భుతం అంటూ ఎద్దేవా చేసిన షర్మిల
ఎలాంటి తెలంగాణను కోరుకున్నామో ఆ తెలంగాణ ఆవిష్కృతమైందని, రాష్ట్రంలో అన్నీ అద్భుతమేనంటూ నిన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు. "ఊపర్ షేర్వాణీ... అందర్ పరేషానీ... కేసీఆర్ కీ కహానీ!" అంటూ ఎద్దేవా చేశారు.

"రాష్ట్రంలో కరోనా చావులు లేవు... అంతా అద్భుతమే! మూడెకరాల భూమి అందని దళితులు లేరు, డబుల్ బెడ్ రూం ఇళ్లు దొరకని పేదలు లేరు, రాష్ట్రానికి అప్పులు లేవు, తాగుబోతుల తెలంగాణ కాదు, గల్లీకొక బారు లేదు, వీధికొక వైన్ షాపు లేదు, పసిపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు లేవు, నిరుద్యోగ చావులు లేవు, రైతుల ఆత్మహత్యలు లేవు... అంతా అద్భుతమే అంటూ ఎత్తిపొడిచారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే మీ మాటలు అద్భుతం... మొత్తానికి మీ అబద్ధాల పాలన మహా అద్భుతం!" అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా షర్మిల పంచుకున్నారు.
Go Back to Shorts
YS Sharmila
CM KCR
Telangana
YSR Telangana Party

More Telugu News