'హైవే' పూర్తిచేసిన ఆనంద్ దేవరకొండ!
- మరో క్రైమ్ థ్రిల్లర్ గా 'హైవే'
- కేవీ గుహన్ నుంచి వస్తున్న మరో సినిమా
- కథానాయికగా మానస రాధాకృష్ణన్ పరిచయం
- నిన్నటితో షూటింగు పూర్తి
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఇది హైవే నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తిస్తూ ఈ కథ నడుస్తుందని గుహన్ చెప్పారు. వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, తెలుగు తెరకి కథానాయికగా మానస రాధాకృష్ణన్ పరిచయమవుతోంది.
తెలంగాణ .. ఆంధ్ర .. కర్ణాటక ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగు జరిగినట్టుగా గుహన్ చెప్పారు. '118' సినిమా మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. సైమన్ కె కింగ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు.
.