చైతూ చీఫ్ గెస్ట్ గా 'బ్యాచ్ లర్' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- అఖిల్ నుంచి రానున్న 'బ్యాచ్ లర్'
- గోపీసుందర్ బాణీలకు మంచి మార్కులు
- ముఖ్యమైన పాత్రలో ఫరియా అబ్దుల్లా
- ఈ నెల 15వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 8వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ లోని 'జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్' లో ఈ వేడుకను జరపనున్నారు. ఈ వేడుకకి చీఫ్ గెస్టుగా చైతూను ఆహ్వానించడం విశేషం.
అఖిల్ సరసన నాయికగా పూజ హెగ్డే కనువిందు చేయనున్న ఈ సినిమాలో, ఈషా రెబ్బా .. ఫరియా అబ్దుల్లా ముఖ్యమైన పాత్రల్లో అలరించనున్నారు. గోపీసుందర్ బాణీలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకాలంగా తాను ఎదురుచూస్తున్న సరైన హిట్ ఈ సినిమాతో పడుతుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు
.