పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ఆర్టీసీ బస్సు

Road Accident in Peddapalli tealngana
  • బెల్లంపల్లి నుంచి హన్మకొండవైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు
  • ఎక్లాస్‌పూర్ వద్ద కారును ఢీకొని లోయలోకి
  • కారులోని వ్యక్తి మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి నుంచి హన్మకొండ వెళ్తున్న పరకాల డిపో బస్సు మంథని మండలం ఎక్లాస్‌పూర్ వద్ద కారును ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Go Back to Shorts
Telangana
Paddapalli
TSRTC
Road Accident
Hanamkonda

More Telugu News