రాశిఖన్నా ఇష్టపడే తెలుగు హీరోలు వీరే!

Rasi Khanna said about her favourite actors
  • తెలుగులో మంచి క్రేజ్
  • తమిళంలోనూ దూకుడు
  • మంచి పాత్రలు పడ్డాయన్న రాశి ఖన్నా  
  • అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టం
ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టిన రాశి ఖన్నా, ఇటీవల కాలంలో తమిళంలో కూడా తన జోరు చూపించే ప్రయత్నాల్లో ఉంది. అందు కోసం అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు బాగానే ఫలించాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు తమిళ సినిమాలు ఉన్నాయి. వాటిలో 'అరణ్మనై 3' .. 'సర్దార్' సినిమాలుపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక తెలుగులో నాగచైతన్య జోడీగా 'థ్యాంక్యూ' .. గోపీచంద్ సరసన నాయికగా 'పక్కా కమర్షియల్' సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాల్లోని పాత్రలు ప్రాధాన్యత కలిగినవేననీ, తనకి మరింత పేరు తీసుకొస్తాయని ఆమె అంటోంది. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ నేపథ్యంలో తనకి ఇష్టమైన టాలీవుడ్ హీరోలు .. హీరోయిన్ల గురించి రాశి ఖన్నా ఇన్ స్టా లో ప్రస్తావించింది. "హీరోలందరూ నాకు ఇష్టమే. కాకపోతే ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ అంటే మరింత ఇష్టం. అల్లు అర్జున్ డాన్స్ కి నేను పెద్ద అభిమానిని. ఇక హీరోయిన్లలో అనుష్క .. సమంత అంటే ఎక్కువ ఇష్టం. వాళ్లలా నటించాలని ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Rasi Khanna
Junior NTR
Mahesh Babu
Allu Arjun

More Telugu News