మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి యువరాజ్ సింగ్ సాయం
- యువరాజ్ సామాజిక సేవ
- తన పేరిట ఫౌండేషన్ స్థాపన
- 'యూ వుయ్ కెన్' విభాగంతో కలిసి సేవా కార్యక్రమాలు
- మహబూబ్ నగర్ ఆసుపత్రికి బెడ్లు, ఉపకరణాలు అందజేత
తాజాగా, యువరాజ్ సింగ్ తన యూ వుయ్ కెన్ సంస్థతో కలిసి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా సాయం అందించారు. రూ.1 కోటి విలువైన 50 క్రిటికల్ కేర్ బెడ్లను, అత్యాధునిక వైద్య ఉపకరణాలను విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన పత్రాలను 'యూ వుయ్ కెన్' సంస్థ ప్రతినిధులు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందించారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ కు, 'యూ వుయ్ కెన్' సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
