తన మామ గంగిరెడ్డికి సీఎం జగన్ పుష్పాంజలి... ఫొటోలు ఇవిగో!
- గతేడాది మరణించిన సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి
- పులివెందులలో ప్రథమ వర్థంతి కార్యక్రమం
- కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన సీఎం జగన్
- 'మరపురాని జ్ఞాపకం...' పుస్తకం ఆవిష్కరణ
కాగా, ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా సీఎం జగన్ పులివెందులలో ఘనంగా నివాళులు అర్పించారు. తన మామ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పులివెందుల లయోలా కాలేజిలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ఈసీ గంగిరెడ్డిపై రూపొందించిన 'మరపురాని జ్ఞాపకం-డాక్టర్ ఈసీ గంగిరెడ్డి' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.
